నక్సలిజం మరో 20 ఏళ్లు సాగడానికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తీర్పే కారణం
న్యూఢిల్లీ,26 ఆగస్టు (హి.స.): అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డంకిగా మారిన మావోయిస్టుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి గిరిజనులు ఏర్పాటు చేసుకున్న సల్వాజుడుంని రద్దుచేసి.. కొన ఊపిరితో ఉన్న నక్సలిజం మరో రెండు దశాబ్దాలు కొనసాగడానికి దోహదం చేసింది ప్రతిప
Amit Shah


న్యూఢిల్లీ,26 ఆగస్టు (హి.స.): అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డంకిగా మారిన మావోయిస్టుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి గిరిజనులు ఏర్పాటు చేసుకున్న సల్వాజుడుంని రద్దుచేసి.. కొన ఊపిరితో ఉన్న నక్సలిజం మరో రెండు దశాబ్దాలు కొనసాగడానికి దోహదం చేసింది ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తీర్పేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి ఆరోపించారు. సోమవారం ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్య చేశారు. ‘‘జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నక్సల్‌ అనుకూలమని నేను ప్రత్యేకంగా చెప్పలేదు. ఆదివాసీల ఆత్మరక్షణకోసం ఉన్న వ్యవస్థను ఆయన సమాప్తం చేశారు. దానివల్లే నక్సలిజం మరో రెండు దశాబ్దాలకు పైగా సాగింది. అది ఆయన తీర్పేనని సుప్రీంకోర్టు రికార్డులే చెబుతున్నాయి. నక్సల్స్‌ కారణంగా దెబ్బతిన్న పాఠశాలల్లో సీఆర్‌పీఎఫ్, ఇతర భద్రతా బలగాలు ఉంటే రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీచేసి వారిని బయటికి పంపించేశారు. ఆ సమయంలో భద్రతా దళాలపై చాలాచోట్ల దాడులు జరిగాయి. కచ్చితంగా ఆ తీర్పుతో మావోయిస్టులకు రక్షణ లభించింది.

5

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande