తెలంగాణ, నల్గొండ.26 ఆగస్టు (హి.స.) గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. మార్నింగ్ వాక్లో భాగంగా మంగళవారం చందంపేట మండల కేంద్రంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు