మహీంద్రా యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు.. కిలోన్నర గంజాయి, 47 గ
మహేంద్ర యూనివర్సిటీ


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు.. కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ స్వాధీనం చేసుకున్నారు.

మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో మహీంద్రా యూనివర్సిటీలో మంగళవారం నాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రీమారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. గతంలో నైజీరియన్ నిక్ నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి.. పలు పబ్లో విద్యార్థులు పార్టీలు చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande