ఆప్‌ మాజీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఇంట్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ,26 ఆగస్టు (హి.స.): ఆమ్‌ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, దిల్లీ మాజీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణంలో పలు అవకతవకలు జరిగినట
Ed


న్యూఢిల్లీ,26 ఆగస్టు (హి.స.): ఆమ్‌ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, దిల్లీ మాజీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణంలో పలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ (Enforcement Directorate) నేడు తనిఖీలు చేపట్టింది. దిల్లీలోని సౌరభ్‌ భరద్వాజ్‌ (Saurabh Bharadwaj) నివాసంతో పాటు మరో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దర్యాప్తు సంస్థ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.

2018-19లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 24 ఆసుపత్రుల నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం రూ.5,590 కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఓ ఐసీయూ ఆసుపత్రిని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా.. మూడేళ్లు దాటినా అది పూర్తికాలేదు. ఇందుకోసం రూ.800 కోట్లు ఖర్చు చేసినా.. కేవలం సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో ఆ ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే తాజాగా సౌరభ్‌ భరద్వాజ్‌ నివాసంలో తనిఖీలు చేపట్టింది.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande