పూజలు అందుకోకుండానే గంగమ్మ ఒడికి గణపయ్య..
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) గణేష్ ఉత్సవాలు ప్రారంభం కాకముందే ఓ బొజ్జగణపతి హుస్సేన్సాగర్లో నిమజ్జనం అయ్యాడు. దోమల్గూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఓ అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించేందుకు సోమవారం ఘట్కేసర్లో గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చ
గణపయ్య


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

గణేష్ ఉత్సవాలు ప్రారంభం కాకముందే ఓ బొజ్జగణపతి హుస్సేన్సాగర్లో నిమజ్జనం అయ్యాడు. దోమల్గూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఓ అపార్ట్మెంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించేందుకు సోమవారం ఘట్కేసర్లో గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఓ వాహనంలో ఆ భారీ విగ్రహాన్ని మండపానికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో హిమాయత్నగర్లోని వీధి నం.5లో మూల మలుపు వద్ద కేబుల్ వైరుకు తగలడంతో గణనాథుడు వాహనంపై నుంచి కింద పడిపోయాడు. దీంతో విగ్రహం కొంత ధ్వంసమైంది. దీంతో నిర్వాహకులు ధ్వంసమైన వినాయకుడి విగ్రహాన్ని పీపుల్స్ ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు. కాగా, ఈ ఘటనలో వాహనంపైన ఉన్న బీహార్కు చెందిన గోల్మార్ (25) అనే యువకుడు కిందపడిపోవడంతో అతని ఎడమ కాలుకు బలమైన దెబ్బలు తగిలాయి. మూడు ద్విచక్ర వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande