అమరావతి, 26 ఆగస్టు (హి.స.) వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాలలో ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తీరాలకి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రమట్టం నుంచి 5.8 కిమీ మధ్యలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి