పర్యావరణ రహిత వినాయక ప్రతిమలను పూజిద్దాం: కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్. 26 ఆగస్టు (హి.స.) జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా మతసామరస్యాలకు ప్రతీకగా వినాయక పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలకు సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మెద
మెదక్ కలెక్టర్


మెదక్. 26 ఆగస్టు (హి.స.)

జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా

మతసామరస్యాలకు ప్రతీకగా వినాయక పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలకు సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్లో 2000 వేల ఉచిత మట్టి గణపతుల కలెక్టర్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని కలెక్టరేట్లో పని చేసే అన్ని శాఖల సిబ్బందికి ఇతర ప్రజలకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి ప్రాముఖ్యతను వివరిస్తూ వినాయక మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు సలహాలు అందించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande