హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో
ఇటీవల సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా తీసుకుంది. కేసు పూర్తి వివరాలు అందించాలని స్థానిక పోలీసులను కమిషన్ ఆదేశించింది. ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో స్వాతి శరీర భాగాలు ఇప్పటికీ దొరకకపోవడం గమనార్హం. పోలీసుల విచారణలో నిందితుడు మహేందర్ రెడ్డి పొంతన లేని సమాధానాలు ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం, ముందుగా కవర్లలో చుట్టి మూసీ నదిలో పారవేశానని చెప్పడంతో పోలీసులు పది కిలోమీటర్ల మేర గాలించారు. కానీ ఫలితం దక్కలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..