అమరావతి, 26 ఆగస్టు (హి.స.)సాంకేతిక విద్యాశాఖ నిర్వాకం కారణంగా ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల అడ్మిషన్లకు అనుమతి లభించలేదు. గత రెండేళ్లుగా ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ డిగ్రీ కోర్సులకు అనుమతులు వచ్చాయి. ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు బీబీఏ, బీసీఏ కోర్సులను ప్రవేశపెట్టాయి. ఆ రెండు కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు వచ్చాక సాంకేతిక విద్యాశాఖ ఆ కాలేజీలు, కోర్సుల జాబితాను ఉన్నత విద్యామండలికి ఇవ్వాలి. కానీ ఆ వివరాలను మండలికి ఇవ్వలేదు. దీంతో ఆ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులను ఆప్షన్లలో పెట్టకపోవడంతో అడ్మిషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక విద్యాశాఖ స్పందించని కారణంగా ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజీలు అడ్మిషన్ల జాబితాలో లేకుం డా పోయాయి. దీంతో ఆ రెండు కోర్సులు కోరుకునే విద్యార్థులకు నిరాశ ఎదురవుతోంది. బీబీఏ, బీసీఏ కోర్సులకు ఇప్పుడు డిమాండ్ భారీగా ఉంది. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ సీటు రానివారు బీసీఏ కోర్సుకు మొగ్గు చూపుతుండగా.. బీబీఏ కోర్సులకూ డిమాండ్
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ