రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ప్రభావంతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జ
Heavy rains


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ,

బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ప్రభావంతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande