పక్షుల షాపులపై ఫారెస్ట్ అధికారుల దాడులు.. 71 పక్షుల స్వాధీనం
నిజామాబాద్, 26 ఆగస్టు (హి.స.) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ అధికారులు పలు షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్షుల షాపులలో ఫారెస్ట్ చట్టాన్ని అతిక్రమించి అడవుల్లో ఉండాల్సిన పక్షులను విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఫారెస్ట్ బృందాలు దా
ఫారెస్ట్ అధికారులు


నిజామాబాద్, 26 ఆగస్టు (హి.స.)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ అధికారులు పలు షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. పక్షుల షాపులలో ఫారెస్ట్ చట్టాన్ని అతిక్రమించి అడవుల్లో ఉండాల్సిన పక్షులను విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఫారెస్ట్ బృందాలు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు షాపులలో రామచిలుకలు, కంజు పిట్టలను విక్రయిస్తున్నట్లుగా గుర్తించి, వివిధ రకాల రామచిలుకలు, కంజు పిట్టలు మొత్తం 71 పక్షులను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపుల నిర్వాహకుల పై ఫారెస్ట్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande