' భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించాలి 'గద్వాల ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల.26 ఆగస్టు (హి.స.) విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యతని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవ
గద్వాల ఎమ్మెల్యే


జోగులాంబ గద్వాల.26 ఆగస్టు (హి.స.)

విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యతని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ తో కలిసి మొక్కలు నాటి అందరిలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాతావరణ సమతుల్యాన్ని కాపాడి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు ప్రభుత్వం వనమహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందిస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉన్నందున భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande