అమరావతి, 26 ఆగస్టు (హి.స.)
విజయవాడ: ఐపీఎస్ అధికారి సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సంజయ్‌ను గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో మంగళవారం ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అగ్నిమాపక, సీఐడీ డీజీగా ఉన్నప్పుడు సంజయ్ అవకతవకలకు పాల్పడ్డారంటూ గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ