అమరావతి, 26 ఆగస్టు (హి.స.)రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నాలా చట్టం రద్దు, లే అవుట్ డెవల్‌పమెంట్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ నిబంధనల్లో సడలింపు వంటి ప్రభుత్వ సానుకూల నిర్ణయాలతో పరిశ్రమలకు మేలు జరిగిందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవల్‌పమెంట్ కౌన్సిల్ (నరెడ్కో) సెంట్రల్‌జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 19 నుంచి 21 వరకు నరెడ్కో సెంట్రల్ జోన్ 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌ను విజయవాడలోని ఏ-కన్వెన్సన్‌లో నిర్వహించనున్నామన్నారు. ఎస్‌ఎల్‌వీ డెవలపర్స్ చైర్మన్ పెనుమత్స శ్రీనివాసరాజు నరెడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి, సెంట్రల్‌జోన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ హరి ప్రసాద్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ