విధులు సంక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవు..సిబ్బందిపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం
సిద్దిపేట.26 ఆగస్టు (హి.స.) గ్రామాలలో సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్ వ్యాపిస్తున్నందున వైద్య, శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామాన్
అడిషనల్ కలెక్టర్


సిద్దిపేట.26 ఆగస్టు (హి.స.) గ్రామాలలో సీజనల్ వ్యాధులు,

వైరల్ ఫీవర్ వ్యాపిస్తున్నందున వైద్య, శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని వారు సందర్శించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి, ఇటీవల డెంగీతో మృతి చెందిన నాయిని శ్రావణ్, కొంతం మహేష్ ల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీవో, కార్యదర్శి, శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విష జ్వరాలు విజృంభించి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటే, గ్రామానికి వెళ్లి ముందస్తుగా వివరాలు సేకరించడంలో జాప్యం జరగడంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందిపై మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande