హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తీసుకున్నది. ఈ మేరకు ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు పూనుకుంది. జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందిన నివేదికను సభలో కాళేశ్వరం కమిషన్ ప్రవేశపెట్టనున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా, జిస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి శుక్రవారం హైకోర్టుకు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై అందిన నివేదకను అసెంబ్లీలో ప్రవేశపెడతామని.. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు ధర్మాసనానికి విన్నవించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్లో ఉండబోతుందోనని ఇరు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..