ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్క్యూలర్ జారీ చేసిన సీఎస్
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 29న సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణా రావు పాల్గొనున్నారు. అయితే, అసెంబ్లీ సమా
క్యాబినెట్ భేటీ


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన

ఈ నెల 29న సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణా రావు పాల్గొనున్నారు. అయితే, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేబినెట్ భేటీలో చర్చించాల్సిన పలు అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అజెండా అంశాలను సాధారణ పరిపాలన విభాగానికి (GAD)కి పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణ రావు ఇవాళ సర్క్యూలర్ జారీ చేశారు. కేబినెట్లో ప్రధాన అజెండాగా జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును ఆమోదించనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande