రేపటి నుంచి 11 రోజులపాటు ఖైరతాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ ఖైరతాబాద్లో బుధవారం బడా గణేశ్ కొలువు దీరనున్నాడు. గణనాథుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబ
ట్రాఫిక్ ఆంక్షలు


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ ఖైరతాబాద్లో బుధవారం బడా గణేశ్ కొలువు దీరనున్నాడు. గణనాథుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, మింట్కాంపౌండ్, నెక్లస్ రోటరీ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని తెలిపారు. ఈ నేపథ్యంలో పది రోజులపాటు వాహనాలు దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande