సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి : ఎమ్మెల్యే అది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, 26 ఆగస్టు (హి.స.) సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మండల గౌడ సంఘము ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ చ
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్


రాజన్న సిరిసిల్ల, 26 ఆగస్టు (హి.స.)

సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మండల గౌడ సంఘము ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి కోసం అసమానతలపై పోరాడినా ఘనత సర్దార్ సర్వాయి పాపన్న దక్కుతుందన్నారు.

యువత అందరం కలిసి ఆ మహనీయుని అడుగు జాడల్లో నడవలన్నారు. ఈ సందర్భంగా పాపన్న చేసిన పోరాటాలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ తరాలకు మహనీయుడు పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేయడం గొప్ప విషయమన్నారు. అందులో తనను భాగస్వామ్యం చేసిన గౌడ కులస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande