పౌష్టికాహారం తీసుకుని తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి: యాదాద్రి కలెక్టర్
యాదాద్రి భువనగిరి, 26 ఆగస్టు (హి.స.) గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరి మండలం రెడ్డినాయక్ తండా గ్రామంలో అమ్మకి భరోసా కార్యక్రమం నిర్వహించ
యాదాద్రి కలెక్టర్


యాదాద్రి భువనగిరి, 26 ఆగస్టు (హి.స.) గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరి మండలం రెడ్డినాయక్ తండా గ్రామంలో అమ్మకి భరోసా కార్యక్రమం నిర్వహించారు. రెడ్డినాయక్ తండా గ్రామంలోని మొదటి ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీ స్త్రీ ఇంటిని కలెక్టర్ సందర్శించి, ఆప్యాయంగా మాట్లాడి, వారి బాగోగులు,ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande