అమరావతి, 26 ఆగస్టు (హి.స.)రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న కైకలూరులో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా సూర్య కామినేని హాస్పిటల్ ఎదురు మెయిన్ రోడ్డు నందు ఈ జాబ్ మేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేళాలో యువత పెద్దఎత్తున పాల్గొని ఉద్యోగాలు పొందాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి యన్.జితేంద్ర కోరారు. ఈ జాబ్ ఫెయిర్‌లో 10కి పైగా కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని, అలాగే సుమారు 700 మందికి పైగా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాకు పదవ తరగతి, ఇంటర్, ఐ.టి.ఐ, డిగ్రీ, పి.జి వంటి విద్యార్హతలు ఉండి 18-30 ఏళ్లు వయస్సుగల వారు అర్హులను స్వష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి