ఏపీ ప్రజలకు తీపికబురు.. ఇక డెడ్ చీప్‌గా ఔషధాలు
అమరావతి, 26 ఆగస్టు (హి.స.)ఐదేళ్ల వైసీపీ (YCP) విధ్వంస పాలన తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ సంక్షేమం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజారంజక పాలనతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్ని రంగాల్లో తనదైన ముద్రవేస్తూ ముందుకు వెళ్తున్
ఏపీ ప్రజలకు తీపికబురు.. ఇక డెడ్ చీప్‌గా ఔషధాలు


అమరావతి, 26 ఆగస్టు (హి.స.)ఐదేళ్ల వైసీపీ (YCP) విధ్వంస పాలన తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ సంక్షేమం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజారంజక పాలనతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్ని రంగాల్లో తనదైన ముద్రవేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ పరిధిలో జనరిక్ మెడికల్ స్టోర్ల (Generic Medical Stores)ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

నిరుపేదలపై ఏమాత్రం ఆర్థికంగా భారం పడకుండా జనరిక్ మెడిసిన్ విస్తృతంగా అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఆ మెడికల్ స్టోర్ల ఏర్పాటుకు బీసీ కార్పొరేషన్‌ (BC Corporation) నుంచి దరఖాస్తులను స్వీకరించి అనుమతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే సంబంధించి శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకోబోతున్న తాజా నిర్ణయంతో అతి తక్కువ ధరలకే నిరుపేదలకు మెడిసిన్లు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న బీసీ యువతకు కూడా జీవనోపాధి లభించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande