అల్లకల్లోలంగా ఉప్పాడ సముద్రతీరం..
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. దీంతో కెరటాలు రోడ్డు పైకి ఎగసిపడుతున్నాయి. కెరటాల తాకిడికి ఉప్పాడ- క
అల్లకల్లోలంగా ఉప్పాడ సముద్రతీరం..


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కి సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. దీంతో కెరటాలు రోడ్డు పైకి ఎగసిపడుతున్నాయి. కెరటాల తాకిడికి ఉప్పాడ- కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, భారీగా ఎగిసి పడుతున్న కెరటాల తాకిడికి రక్షణగా రోడ్డు సైడ్ వేసిన రాళ్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్డుపై భారీ గోతులు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మన్యం, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలోని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్ర తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. ఇక, ఐదు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సూచించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నంలో 10 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande