హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు..
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)నగరంలోని మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ భాగంలో ఒక్కసారిగ మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. బస్సును పక్కకు నిలిపివేసి.. ప్రయాణికులందరినీ కిందకు దించేశ
హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు..


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)నగరంలోని మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ భాగంలో ఒక్కసారిగ మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. బస్సును పక్కకు నిలిపివేసి.. ప్రయాణికులందరినీ కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా దగ్దం అయిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande