తిరుపతి, 26 ఆగస్టు (హి.స.)వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress party) అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) రేపు 27న తిరుమల(Tirumala) పర్యటనకు వెళ్తున్నట్లు రెండు రోజులుగా ప్రచారం జరిగింది. జగన్ తిరుమల వెళ్లిన ప్రతిసారి డిక్లరేషన్ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఇవ్వబోతున్నారనే ప్రచారం కొనసాగుతోంది. దీంతో జగన్ తిరుమల పర్యటన లేదని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిస్పష్టం చేశారు. .
జగన్ తిరుమల వెళ్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని తెలిపారు. చంద్రబాబు పాలనలో కంటే జగన్, వైఎస్ హయాంలోనే హిందు ధర్మ పరిరక్షణ జరిగిందని తెలిపారు. శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం YCP హయాంలోనే ప్రారంభం అయిందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి