ఎన్ని చేతులున్న గణపతిని పూజించాలి? పత్రిలో దాగి ఉన్న పర్యావరణ రహస్యం..
అమరావతి, 26 ఆగస్టు (హి.స.)వినాయకచవితి రోజున విఘ్నేశ్వరుడిని పూజిస్తే.. చేపట్టే ప్రతి పనిలో విఘ్నాలు తలెత్తకుండా ఉంటాయని అందరి విశ్వాసం. అయితే వినాయకచవితికి మండపాల్లో ప్రతిష్టించే గణేషుడి ప్రతిమలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. అలాగే ఎనిమిది చేతులున్న గణపతి
ganesh


అమరావతి, 26 ఆగస్టు (హి.స.)వినాయకచవితి రోజున విఘ్నేశ్వరుడిని పూజిస్తే.. చేపట్టే ప్రతి పనిలో విఘ్నాలు తలెత్తకుండా ఉంటాయని అందరి విశ్వాసం. అయితే వినాయకచవితికి మండపాల్లో ప్రతిష్టించే గణేషుడి ప్రతిమలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. అలాగే ఎనిమిది చేతులున్న గణపతి ప్రతిమలను ప్రతిష్టించకూడదని పండితులు సూచిస్తున్నారు. మట్టితో నాలుగు చేతులతో ఉన్న గణపతిని రూపొందించి.. నవరాత్రులు పూజించిన తర్వాత జలంలో నిమజ్జనం చేయాలి.

నాలుగు చేతులతో ఉన్న గణేషుడిని పూజించడం శుభప్రదం. పై చేతుల్లో పాశాంకుశమును దాల్చి ఉండాలి. కింది చేతుల్లో ఒకటి అభయహస్తం, మరో చేతిలో లడ్డూకం లేదా వరద ముద్రలతో ఉన్న గజవదనుడై ఉన్న గణపతిని పూజించడం మన సంప్రదాయమని పండితులు పేర్కొన్నారు.

వినాయకుని పూజలో వాడే పత్రిలో 21 రకాల ఆకులు ఉండాలి. వాటిలో గరిక తప్పనిసరి. ఎందుకంటే ఆ లంబోదరుడికి గరికతో పూజ చేసినంతనే ఎంతో పుణ్య ఫలం దక్కుతుందని పురాణ కథలు చెప్తున్నాయి. మాచీ, బృహతి, బిల్వ, దూర్వా (గరిక), ఉమ్మెత్త, బదరీ, ఉత్తరేణి, తులసీదళం, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, దేవదారు, మరువకం (మరువం), వావిలి, సన్నజాజ, దేవకాంచన, శమీ, అశ్వత్థ, అర్జున పత్రాలన్నింటినీ కలిపి పత్రిగా పిలుస్తారు. 21 రకాల ఆకులతో గణేషుడిని పూజించడం వెనుక ఓ పర్యావరణ రహస్యం కూడా ఉంది. నవరాత్రులు ముగిసిన తర్వాత పత్రి సహా.. గణనాథుడిని నీటిలో నిమజ్జనం చేస్తాం. వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నీరంతా చెరువులు, నదుల్లో చేరుతుంది. ఫలితంగా నీరు కాస్త కలుషితమవుతుంది. అందులో ఉన్న క్రిమికీటకాలను నాశనం చేసే శక్తి ఈ పత్రిలో ఉంటుంది. నీటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించి ఆక్సిజన్ స్థాయిల్ని పెంచుతుందని నమ్మకం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande