గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డెట్.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)2024 జనవరి 31వ తేదీన తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. గడువు ముగిసి ఒకటిన్నరేళ్లయినా ఎన్నికలు నిర్వహణ మందకొడిగా సాగుతోంది. కానీ.. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డెట్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నిక
vote fraud nadapuram


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)2024 జనవరి 31వ తేదీన తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. గడువు ముగిసి ఒకటిన్నరేళ్లయినా ఎన్నికలు నిర్వహణ మందకొడిగా సాగుతోంది. కానీ.. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డెట్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇదిలా ఉండగా.. తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన జూన్ 25న తుది తీర్పును న్యాయస్థానం వెలువరించిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తిచేసి, ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. 2024 జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. గడువు ముగిసి ఒకటిన్నరేళ్లయినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై న్యాయస్థానంలో 6 పిటిషన్లు దాఖలు అయ్యాయి. సర్పంచ్​ల పరిపాలన లేక గ్రామాల అభివృద్ధి వెనుకబడుతోందని బీఆర్​ఎస్​, బీజేపీలు ఆరోపిస్తున్న విషయం విదితమే. గ్రామ పంచాయతీ ఎన్నికలపై తీర్పును జస్టిస్ టి.మాధవిదేవి వెలువరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande