రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!
న్యూఢిల్లీ,26 ఆగస్టు (హి.స.) భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నడిచాయి. భారత్ మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ సుంకాలు కారణంగా ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత భారత్‌ప
రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!


న్యూఢిల్లీ,26 ఆగస్టు (హి.స.) భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నడిచాయి. భారత్ మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ సుంకాలు కారణంగా ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా భారత్‌పై మరో 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. దీంతో ఆసియాలోనే భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టింది.

అయితే కొత్త సుంకం ఆగస్టు 27 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు పంపించింది. ఆగస్టు 27న అర్ధరాత్రి నుంచి 50 శాతం సుంకం అమలవుతున్నట్లుగా నోటీసులో స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande