అనకాపల్లి.జిల్లాలో మొట్టమొదటి సరిగా అత్యంత ఎత్తైన గణనాధుడు
అనకాపల్లి, 27 ఆగస్టు (హి.స.) జిల్లాలో మొట్టమొదట సారిగా దేశంలోనే అత్యంత ఎత్తైన గణనాథుడు ఈసారి కొలువు దీరాడు. అనకాపల్లి పట్టణం ఇప్పుడు దేశం చూపును ఆకర్షిస్తోంది. ఇక్కడ 126 అడుగుల భారీ శ్రీలక్ష్మీ గణపతి విగ్రహంను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి పెద్దదైన
ganesh


అనకాపల్లి, 27 ఆగస్టు (హి.స.)

జిల్లాలో మొట్టమొదట సారిగా దేశంలోనే అత్యంత ఎత్తైన గణనాథుడు ఈసారి కొలువు దీరాడు. అనకాపల్లి పట్టణం ఇప్పుడు దేశం చూపును ఆకర్షిస్తోంది. ఇక్కడ 126 అడుగుల భారీ శ్రీలక్ష్మీ గణపతి విగ్రహంను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి పెద్దదైన మట్టితో తయారు చేసిన ఈ గణేష్ విగ్రహం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ​

అనకాపల్లి గణేష్ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి కామదేను ప్రసాద్ పర్యవేక్షణలో 45 మంది కార్మికులు దాదాపు 50 రోజులు నుంచి తయారు చేశారు. ఈ వినాయకుడి విగ్రహం తయారీకి పది టన్నుల బంక మట్టిని వినియోగించారు. నేటి నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కాలంలో రోజుకో సాంస్కృతిక కార్యక్రమం, ఆధ్యాత్మిక పోటీలు నిర్వహిస్తారు. భారీ లంబోదరుడిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

ఎన్టీఆర్‌ క్రీడా మైదానం వద్ద 126 అడుగుల మట్టి గణపతిని సంపత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. గిన్నిస్‌ బుక్‌లో స్థానం పొందడమే లక్ష్యంగా భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ అధ్యక్షుడు బుద్ధ భూలోక నాయుడు చెప్పారు. విగ్రహం తయారీ కోసం పది టన్నుల మట్టి, మండలం ఏర్పాటు కోసం తొంబై టన్నుల సరుగుడు బాదులు వాడారు. విగ్రహం తయారీకి సుమారు రూ.70 లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. స్వామివారిని రోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు భక్తులు దర్శించుకోవచ్చు. మిగతా సమయాల్లో హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనేందుకు టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 22న అన్నసమారాధన, 23న నిమజ్జన కార్యక్రమం ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande