బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు.. బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 31వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న
బండారు దత్తాత్రేయ


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)

త్వరలో రాబోయే స్థానిక సంస్థల

ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 31వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న బీసీల యుద్ధభేరి సభ పోస్టర్ను వారు నేడు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దత్తత్రేయ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా కాకుండా, పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించడంతో ఆ పార్టీకి అసలు బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్న ఉద్దేశం లేనట్లుదన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇష్టం లేక సమస్యను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. కేంద్రం పై వ్యతిరేక ప్రచారం మానుకోవాలన్నారు,. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని అమలు చేసే బాధ్యత కూడా వారిపైనే ఉందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande