హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)
వినాయక చవితి సందర్భంగా మండపాల్లో వివిధ రకాల గణపతులు దర్శనిమిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర లో భాగంగా దాయాది దేశం మిస్సైళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఎస్-400 ఢిఫెన్స్ సిస్టమ్ నమూనాలో గణనాథుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఇండియన్ ఆర్మీ వేషధారణలో బొజ్జ గణపయ్య సందడి చేస్తున్నాడు. అదేవిధంగా పండుగ వేళ కొంతమంది మైక్రో ఆర్టిస్టులు రూపొందించి ఆర్ట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లాలోని ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత గుర్రం దయాకర్ ఔరా.. అనేలా అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. ఏకంగా గుండు పిన్నుపై గణనాథుడు ఆపరేష్ సిందూర్లో ఇండియా శక్తిని చాటిచెప్పిన బ్రహ్మోస్ మిస్సైల్ను పట్టుకున్నట్లుగా రూపొందించాడు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..