ఒడిశా తీరానికి అనుకోని వాయువ్య బంగాళా ఖాతంలో అల్ప పీడనం
అమరావతి, 27 ఆగస్టు (హి.స.) : ఒడిశా తీరానికి ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశముంది. తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీలో పలుచోట్ల మ
ఒడిశా తీరానికి అనుకోని వాయువ్య బంగాళా ఖాతంలో అల్ప పీడనం


అమరావతి, 27 ఆగస్టు (హి.స.)

: ఒడిశా తీరానికి ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతోంది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశముంది. తీవ్ర అల్పపీడనం వల్ల ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తీరం వెంట 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande