మోదీకి మద్దతుగా ఫిజీ పీఎం వ్యాఖ్యలు
దిల్లీ:27 ఆగస్టు (హి.స.): అమెరికా టారిఫ్‌ల వేళ భారత్‌కు ఫిజీ ప్రధాని సితివేణి లిగమామద రబుక కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం నుంచి ఎదురవుతోన్న సవాళ్లను ప్రధాని నరేంద్రమోదీ ఎదుర్కోగలరని విశ్వాసం వ్యక్తంచేశారు (India- Fiji). ఇరుదేశాల మధ్య సంబంధాలను బలో
PM Narendra Modi Addressing the gathering


దిల్లీ:27 ఆగస్టు (హి.స.): అమెరికా టారిఫ్‌ల వేళ భారత్‌కు ఫిజీ ప్రధాని సితివేణి లిగమామద రబుక కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం నుంచి ఎదురవుతోన్న సవాళ్లను ప్రధాని నరేంద్రమోదీ ఎదుర్కోగలరని విశ్వాసం వ్యక్తంచేశారు (India- Fiji). ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకునేదిశగా ఆయన మూడు రోజులు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

‘‘టారిఫ్‌ల గురించి ప్రకటనలు చూసిన తర్వాత నేను పీఎం మోదీ (PM Modi)కి ఒక మాట చెప్పాను. కొందరు మీ వైఖరితో కొందరు సంతోషంగా లేరు. కానీ మీరు ఎలాంటి అడ్డంకులైనా ఎదుర్కోగలరు. రెండు పెద్దదేశాలు ఘర్షణ పడినప్పుడు ఆ ప్రభావం చిన్నదేశాలపై పడుతుంది. ఇంట్లో చిన్నవాడు ఆ వ్యవహారాలతో సౌకర్యంగా ఉండలేడు. కూర్చొని చూడటం తప్ప ఏమీ చేయలేడు’’ అని ‘ఓషన్ ఆఫ్ పీస్‌’ పేరిట ఆయన మాట్లాడారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమలవుతోన్న సంగతి తెలిసిందే

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande