తెలంగాణ, మేడ్చల్. 27 ఆగస్టు (హి.స.) ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలో
వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ వినాయక భక్తులు మండపాలను ఏర్పాటు చేసుకుని బుధవారం భక్తిశ్రద్ధలతో పూజలు ప్రారంభించారు. మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ పరిధిలో పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని సూర్య యువజన సంఘం ఏర్పాటు చేసిన మండపంలో వినాయకుడి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు