కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య బుధవారం ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టు
కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య బుధవారం ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలిలో పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గడ్చిరోలి పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande