హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)
ఆనందోత్సాహాల మధ్య వినాయక
చవితి సంబరాలను జరుపుకుందామనే ఉత్సాహంతో గణేష్ మండపాలను ఎంతో ఖర్చు భరించి అలంకరణ చేసుకున్న నిర్వాహకులను వర్షం నిరుత్సాహపరిచింది. బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో గణేష్ ఊరేగింపు ప్రతిష్టాపన పై సందిగ్ధత నెలకొన్నది. ముందు జాగ్రత్తగా వాటర్ ప్రూఫ్ మండపాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ విగ్రహ ప్రతిష్టాపన, ప్రదర్శనకు వర్షం దెబ్బ తగిలింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఉదయం నాలుగు గంటల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఇండ్లలో జరుపుకునే వినాయక చవితి పండగకు కూడా ఇబ్బందులు తలెత్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..