హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)
తెలంగాణ అంతటా నిన్నటి నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట, నాంపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, మేడ్చల్, శామీర్పేట్ తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, బొమ్మలరామారంలో వర్షం కురుస్తోంది. భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్