అమరావతి, 27 ఆగస్టు (హి.స.)
చిత్తూరు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాకం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్షేత్రం ఒక్కసారిగా భక్త సందడిగా మారిపోయింది. నేటి నుంచి 21 రోజులు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో.. భక్తులు స్వామి వారిని చూడటానికి వివిధ ప్రదేశాల నుంచి తరలివస్తున్నారు. ఈ మేరకు ఆలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, ఉదయం 3 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారికి ఉభయ దారులు ఆనవాయితుగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ