పాకిస్థాన్‌కు మళ్లీ భారత్ హెచ్చరికలు
దిల్లీ:27 ఆగస్టు (హి.స.) పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది. తాజాగా మరోసారి ఇస్లామాబాద్‌కు వార్నింగ్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మానవతా దృక్పథంతో ఇస్లామాబాద్‌కు ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు వి
Himachal Pradesh Reels Under Torrential Rains, Schools Shut in 9 Districts; Kangra Worst Hit


దిల్లీ:27 ఆగస్టు (హి.స.)

పాకిస్థాన్‌ను భారత్ హెచ్చరించింది. తాజాగా మరోసారి ఇస్లామాబాద్‌కు వార్నింగ్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మానవతా దృక్పథంతో ఇస్లామాబాద్‌కు ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మంగళవారం జమ్మూలో కురిసిన భారీ వర్షాల కారణంగా తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హిమాలయాల్లో ఉద్భవించిన ఈ నది జమ్మూ గుండా ప్రవహిస్తుంది. పాకిస్థాన్‌లోని చీనాబ్ నదిలో ఇది కలుస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన ఆనకట్టల నుంచి అదనపు నీటిని విడుదల చేయాల్సి రావడంతో తావి నది మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో తావి నదిలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని బుధవారం మరోసారి పాకిస్థాన్‌కు భారతదేశం హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande