కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో మత్సకారుడికి చిక్కిన 25 కిలోల భారీ చేప
కరీంనగర్, 27 ఆగస్టు (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు నిండుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మత్స్యకారుల వలలకు భారీ సంఖ్యలో చేపలు చిక్కుతున్నాయి. ఒక్కోసారి ఊహించని రీతిలో భారీ చేపలు వలకు చిక
భారీ చేప


కరీంనగర్, 27 ఆగస్టు (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు

కురుస్తుండటంతో చెరువులు నిండుతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మత్స్యకారుల వలలకు భారీ సంఖ్యలో చేపలు చిక్కుతున్నాయి. ఒక్కోసారి ఊహించని రీతిలో భారీ చేపలు వలకు చిక్కుతుండగా.. జాలర్ల పంట పండుతోంది. తాజాగా లోయర్ మానేరు డ్యామ్ వద్ద చేపల వేటకు వెళ్లిన జాలరు వలకు భారీ చేప చిక్కింది.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సంగంపల్లి గ్రామానికి మత్స్యకారుడు సంపత్ లోయర్ మానేరు డ్యామ్ లో చేపల వేటకు వెళ్లాడు. భారీవర్షాల నేపథ్యంలో డ్యామ్ నుంచి ఇటీవల భారీగా వరదనీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక రకాల చేపలు వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చాయి. చేపలవేటకు వెళ్లిన సంపత్ వలకు పాతిక కేజీల భారీ చేప వలకు చిక్కింది. వలను పైకి లాగే క్రమంలో బరువు ఎక్కువగా ఉండటంతో ఎంతో ఆసక్తిగా దానిని బయటికి తీసి చూడగా.. బొచ్చె చేప కనిపించింది.. ఆ చేపను విక్రయానికి పెట్టగా.. పక్క ఊరికి చెందిన ఓ వ్యక్తి రూ.3500కు కొనుగోలు చేసి తీసుకెళ్లాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande