హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ ఖైరతాబాద్ 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వినాయకుడు ఈ ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్దకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేరుకొని ఆయన చేతుల మీదుగా తొలి పూజ ప్రారంభించారు. వర్షంలోనే గవర్నర్ దంపతులు ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో పాల్గొనడం ఆనందంగా ఉంది... రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుని కోరుకుంటున్నానని వెల్లడించారు. ఖైరతాబాద్ బడా గణేశుడికి 15 కిలోల వెండి కడియం, వెండి జంజం సమర్పించారు. పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. బోనాల వేడుకలలాగే గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్