ప్రయాణికులకు బిగ్ అలర్ట్... వరదల వల్ల రద్దైన రైళ్లు ఇవే..
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బిక్నూరు మండలం తలమండ్ల సెక్షన్లో రైల్వే ట్రాక్పై వరద నీరు ప్రవహిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిటి
రైలు రద్దు


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)

తెలంగాణలో భారీ వర్షాల కారణంగా

పలు జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బిక్నూరు మండలం తలమండ్ల సెక్షన్లో రైల్వే ట్రాక్పై వరద నీరు ప్రవహిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నిటిని దారి మళ్లించింది. అక్కన్నపేట-మెదక్ సెక్షన్లోనూ కొన్ని రైళ్లను దారి మళ్లించగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేసారు. రాకపోకలపై ప్రభావం పడింది. కాగా ముంబై-లింగంపల్లి (దేవనగరి ఎక్స్ప్రెస్), లింగంపల్లి-ముంబై, ఓఖా-రామేశ్వరం, భగత్ కోఠి-కాచిగూడ, నిజామాబాద్-తిరుపతి (రాయలసీమ ఎక్స్ప్రెస్)రైళ్లు దారిమళ్లించగా, నిజామాబాద్- తిరుపతి రాయలసీమ ఎక్సప్రెస్ ను రద్దు చేశారు. అలాగే కాచిగూడ-మెదక్ రైలు పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే X ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande