తిరుమల,27 ఆగస్టు (హి.స.)
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకుఎన్డీయేఉప రాష్ట్రపతి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితోపాటు పలువురు ఉన్నతాధికారులు, కూటమి నేతలు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని సీపీ రాధాకృష్ణన్ దర్శించుకోనున్నారు. అంతకుముందు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన సీపీ రాధాకృష్ణన్‌కు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, రాష్ట్ర మంత్రి పి.నారాయణతోపాటు బీజేపీ అగ్రనేతలు నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుమలకు చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ