నిజాంసాగర్ ప్రాజెక్టు కు వరద తాకిడి..11 గేట్లు ఎత్తివేత..
కామారెడ్డి, 27 ఆగస్టు (హి.స.) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం ఉదయం ప్రాజెక్టు 11 వరద గేట్లు ఎత్తి దిగువకు 1,08,261 క్యూసెక్కు
నిజాంసాగర్ ప్రాజెక్టు


కామారెడ్డి, 27 ఆగస్టు (హి.స.)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి

నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో బుధవారం ఉదయం ప్రాజెక్టు 11 వరద గేట్లు ఎత్తి దిగువకు 1,08,261 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి 82,306 ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతుందని అన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు(17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1404.96 అడుగుల (17.788 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అన్నారు. ప్రాజెక్టు 11 వరద గేట్లు ఎత్తివేసి 1,06,161 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నది లోకి, ప్రధాన కాలువ ద్వారా 2,100 క్యూసెక్కుల నీటిని వదిలి పెడుతున్నట్లు ఏఈ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande