మెదక్, 27 ఆగస్టు (హి.స.)
మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం దూప్సింగ్ తండాలో వర్షం కుమ్మేసింది. ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అయితే దూప్ సింగ్ తండాను ఒక్కసారిగా వరద ముంచెత్తింది. ఇళ్లు, గుడుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఇళ్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ప్రజలు.. అంతేకాదు తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు