వికారాబాద్, 27 ఆగస్టు (హి.స.)
విఘ్నూలను తొలగించే ఆది దేవుడు
గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యేమనోహర్ రెడ్డిలు అన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మట్టి వినాయకుని ప్రతిష్టించి తొలి పూజను భక్తిశ్రద్ధలతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. అలాగే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వేడుకల తొలిరోజు నేపథ్యంలో వినాయక మంటపాలలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయా కమిటీలు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు