గణేష్ ఉత్సవాలలో అపశృతి.. వ్యక్తి మృతి..
యాదాద్రి భువనగిరి, 27 ఆగస్టు (హి.స.) వినాయక చవితి పండగ వేళ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి పట్టణంలో బుధవారం విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ నగర్కు చెందిన పోతగల సతీష్ (38) పట్టణంలోని ఓ గణేష్ మండపం పైకి ఎ
వ్యక్తి మృతి


యాదాద్రి భువనగిరి, 27 ఆగస్టు (హి.స.)

వినాయక చవితి పండగ వేళ యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి పట్టణంలో బుధవారం విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ నగర్కు చెందిన పోతగల సతీష్ (38) పట్టణంలోని ఓ గణేష్ మండపం పైకి ఎక్కి టార్పాలిన్ కవర్ కప్పుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి సీసీ రోడ్డు దిమ్మె పై పడ్డాడు. ఈ నేపథ్యంలో తల పగిలి తీవ్రంగా గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై అంబులెన్స్లోలో భువనగిరిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే సతీష్కు చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పండగ పూట ప్రాణనష్టం జరగడంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande