కుండ పోత వర్షం.. పెసర, మినుము పంటకు భారీ నష్టం
సంగారెడ్డి, 27 ఆగస్టు (హి.స.) సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షం దంచికొడుతోంది. చేతికొచ్చిన పెసర పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జిల్లాలోని నిజాంపేట్లో 15.33 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా, అమీన్పూర్ (సుల్తాన్పూర
భారీ వర్షాలు


సంగారెడ్డి, 27 ఆగస్టు (హి.స.) సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా

మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షం దంచికొడుతోంది. చేతికొచ్చిన పెసర పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జిల్లాలోని నిజాంపేట్లో 15.33 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా, అమీన్పూర్ (సుల్తాన్పూర్) 0.23 సెంటీమీటర్ల అతి తక్కువ వర్షపాతం నమోదైంది. కుప్పానగర్, మచ్నూర్, కృష్ణాపూర్, బర్దిపూర్, జీర్లపల్లి, ఝరాసంగం, కక్కెరవాడ, చిలేపల్లి, చిలేపల్లి తండా, దేవరంపల్లి, ఈదులపల్లి, మేదపల్లి, ఏడాకులపల్లి, కృష్ణాపూర్ తదితర గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. హుగ్గెల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు ఉన్న జాతీయ పెట్టుబడి రహదారికి ఇరువైపులా పంట పొలాల్లో భారీగా నీరు చేరింది. దీంతో పంట పొలాలు వాగులను తలపిస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి దారిపొడవునా ఉన్న పంట పొలాలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కురిసిన వర్షాల వల్ల గ్రామాలలో పిల్లలు, వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా పండుగ వర్షం రావడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande