హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)
గణేష్ నవరాత్రుల నేపథ్యంలో
మహిళల భద్రత కోసం షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ప్రత్యేక గస్తీని నిర్వహించనున్నాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనేట్ పరిధిలోని అన్ని ప్రధాన గణేష్ మండపాల వద్ద షీ టీమ్స్ నిఘా పెట్టింది. మండపాలకు వచ్చే మహిళ భక్తులు, యువతలు, పిల్లల పట్ల ఎవరైనా అసభ్యకరంగా, అభ్యతకరంగా ప్రవర్తించినా వారి పట్ల దురుసుగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని షీ టీమ్స్ డీసీపీలు హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా కూడా షీ టీమ్స్ పోకిరీల మీద నిఘా పెట్టిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..