శ్రీశైలం.లో సఖ్యం చెప్పే. సాక్షి గణపతి దేవాలయం
అమరావతి, 27 ఆగస్టు (హి.స.) సున్నిపెంట సర్కిల్, శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం కొలువైన శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన సాక్షిగణపతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకునే భక్తులకు కైలాసంలో ఇక్క
ganesh


అమరావతి, 27 ఆగస్టు (హి.స.)

సున్నిపెంట సర్కిల్, శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం కొలువైన శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన సాక్షిగణపతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకునే భక్తులకు కైలాసంలో ఇక్కడి సాక్షి గణపతి సాక్ష్యం చెబుతాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైల ప్రధాన కార్యాలయానికి తూర్పున రెండు కి.మీ దూరంలో ప్రధాన రహదారిలో ఈ ఆలయం ఉంది. శ్రీశైలం దర్శించే ప్రతి భక్తుడు సాక్షిగణపతిని భక్తి విశ్వాసాలతో దర్శించుకుంటారు. దేశంలోనే మరి ఎక్కడా లేని విధంగా ఈ గణపతి ఆలయం ఉందని భక్తుల నమ్మకం. శ్రీశైల క్షేత్రం దర్శనంతో అశ్వమేధ యాగఫలం లభిస్తుందని మహాభారతంలో పొందుపరిచారు. చక్కటి నల్లరాతితో మలచబడిన ఈ గణపతికి తొండం కుడివైపునకు ఉండి చేతితో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు విగ్రహం ఉండటంతో ఆకర్షిస్తోంది.

ఈ ఆలయం అతి పురాతనం అయినప్పటికీ సుమారు మూడున్నర దశాబ్దాల కిందట ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పూర్వం ఉన్న విగ్రహం రూపురేఖలు కోల్పోవడంతో ఆ స్థానంలో కొత్తది నెలకొల్పారు. 16 స్తంభాలతో ఉన్న ప్రధాన మండపంలో లోపలి నాలుగు స్తంభాలను గోడలతో కలిపి గర్భాలయంగా తీర్చిదిద్దారు. ప్రధాన మండపానికి ముందు భాగంలో రెండు స్తంభాలను ఏర్పాటు చేసి వాటిని ప్రధాన మండపానికి కలుపుతూ ముఖమండపముగా ఏర్పాటు చేశారు. సిమెంట్‌తో నిర్మించిన ముఖ మండప స్తంభాలకు నారద తుంబురులను తీర్చిదిద్దారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande